సెయింట్ థెరిస్సా కళాశాలలో స్వీప్ అవగాహన సదస్సు..
1 min readముఖ్య అతిథులుగా పాల్గొన్న డిపిఓ టి శ్రీనివాస్, ఈవోపీఆర్డి సరళ కుమారి
విద్యార్థునులు అందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక సెయింట్ థెరెస్సా మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్ పార్టిసిపేషన్) కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి జిల్లా పంచాయతీరాజ్ అధికారి టి. శ్రీనివాస విశ్వనాథ్ మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగాధికారి ఎం.సరళ కుమారి పాల్గొన్నారు. ముఖ్యఅతిథి శ్రీనివాస్ విశ్వనాథ్ గారు మాట్లాడుతూ, విద్యార్థినులందరూ తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని, కుల, మత, ప్రాంతీయ పక్షపాతం లేకుండా ఓటు వేసి సరైన నాయకుణ్ణి ఎన్నుకోవాలని తెలియజేశారు. విద్యార్థినులందరూ తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ, ఓటు ప్రాముఖ్యతను తెలియజేసి, విద్యార్థి నులంతా ఓటును నమోదు చేసుకోవాలని, ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం మరియు కళాశాలలోని సోషల్ సైన్స్ విభాగం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సుమారు వెయ్యి మంది విద్యార్థులు కళాశాల అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.