మీ అకౌంట్లో డబ్బులు దొంగలించే యాప్స్ ఇవే !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆండ్రాయిడ్ యూజర్ల బ్యాంకు ఖాతాలనుంచి నగదును తస్కరించే యాప్‌లపై తాజాగా హెచ్చరిక జారీ అయింది. ఖాతాలో డబ్బులు, బ్యాంకింగ్ సమాచారం, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు సహా ఇతర డేటాను దొంగిలించే లక్ష్యంతో మాల్వేర్ యాప్‌లను ట్రెండ్ మైక్రో భద్రతా పరిశోధన గుర్తించింది. తక్షణమే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని హెచ్చరించింది. ఇలాంటి 17 ఆండ్రాయిడ్ యాప్‌లను సంస్థ గుర్తించింది. ఇవి మొబైల్ ఫోన్‌లోని టెక్స్ట్ సందేశాలను కూడా అడ్డుకుంటాయని, అలాగే మరింత ప్రమాదకరమైన మాల్వేర్ బారిన పడేలా చేస్తాయని హెచ్చరించింది. గూగుల్ ప్లేస్టోర్ సేఫ్టీ మెజర్స్‌ను అధిగమిస్తాయని యాప్‌లు డ్రాపర్-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌కు దారితీస్తాయని పేర్కొంది. అందుకే వాటిని డ్రాపర్ యాప్‌లు అంటారని ట్రెండ్ మైక్రోలోని భద్రతా పరిశోధకులు తెలిపారు.
- కాల్ రికార్డర్ APK
- రూస్టర్ VPN
- సూపర్ క్లీనర్- హైపర్ & స్మార్ట్
- డాక్యుమెంట్ స్కానర్ – పీడీఎఫ్ క్రియేటర్
- యూనివర్సల్ సేవర్ ప్రో
- ఈగిల్ ఫోటో ఎడిటర్
- కాల్ రికార్డర్ ప్రో+
- అదనపు క్లీనర్
- క్రిప్టో యుటిల్స్
- ఫిక్స్ క్లీనర్
-యూనివర్సల్ సేవర్ ప్రో - లక్కీ క్లీనర్
- జస్ట్ ఇన్: వీడియో మోషన్
- డాక్యుమెంట్ స్కానర్ ప్రో
- కాంకర్ డార్క్‌నెస్
- సింప్లీ క్లీనర్
- Unicc QR స్కానర్