జామ పండ్లతో లాభాలు ఇవే !
1 min readపల్లెవెలుగువెబ్: జామ పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. సీజన్ లో ఆ పండ్లు మార్కెట్లోకి వచ్చాయంటే వెంటనే కొనుక్కుని తినేయడమే ఆలస్యం. అయితే జామ పండ్లలో లోపల గుజ్జు తెలుపు రంగులో ఉండే ఒకరకం, కాస్త గులాబీ రంగులో ఉండే మరో రకం ఉంటాయి. రెండూ జామ పండ్లే అయినా.. రెండింటితోనూ అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నా కూడా.. వాటిలో కొంత భిన్నమైన పోషకాలు ఉంటాయని, భిన్నమైన ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జామ పండ్లతో ఎన్నో లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి, గుండె ఆరోగ్యం మెరుపడటానికి, బరువు తగ్గడానికి, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి జామ పండ్లు తోడ్పడుతాయని వివరిస్తున్నారు. అంతేగాకుండా జామ పండ్లలోని పదార్థాలు కేన్సర్ రాకుండా చూస్తాయని, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని చెబుతున్నారు. మన చర్మానికి కూడా మేలు చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.