PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంప‌న్నులు నివ‌సిస్తున్న న‌గ‌రాలు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెన్లీ అండ్ పార్ట్ నర్స్ గ్రూప్ రూపొందించిన నివేదికలో సంపన్నులకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరుల్లో అత్యధికులు నగరాల్లోనే నివసిస్తున్నారట. అది కూడా కొన్ని నగరాలే మిలియనీర్లతో తులతూగుతున్నాయట. ఈ మేరకు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ అత్యధికంగా కోటీశ్వరులు ఉన్న టాప్-10 నగరాల జాబితా రూపొందించింది. న్యూయార్క్ మహానగరంలో అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు నివసిస్తున్నారు. న్యూయార్క్ లో 3,45,600 మంది మిలియనీర్లు, 59 మంది బిలియనీర్లు ఉన్నట్టు వెల్లడైంది. ఆ తర్వాత స్థానాల్లో టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ నగరాలు ఉన్నాయి. ఒక మిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన ఆస్తులు ఉన్నవారిని మిలియనీర్ ప్రాతిపదికగా తీసుకుని హెన్లీ అండ్ పార్ట్ నర్స్ గ్రూప్ ఈ నివేదిక రూపొందించింది. టాప్-10లో సగం అమెరికా నగరాలే ఉన్నాయి.

                                                        

About Author