కల్యాణమస్తు పథకానికి కండీషన్స్ ఇవే !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణమస్తు పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లు అవుతుందన్నారు. అయితే ఈ పథకానికి అర్హులు ఎవరు..? ఎలా పథకానికి అప్లై చేసుకోవాలి.. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి.. ఇంకా ఎలాంటి కండిషన్లు ఉన్నాయి లాంటి అన్ని విషయాలు స్పష్టం చేసింది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ . ఈ పథకం ద్వారా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపు సాయాన్ని సీఎం జగన్ ఇస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఓ కండిషన్ పెట్టారు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కచ్చితంగా పదో తరగతి పాస్ అయి ఉండాలన్నారు. నిరక్ష్యరాస్యతను రూపుమాపే చర్యల్లో భాగంగానే ఈ నిబంధన పెట్టామని మంత్రి బొత్స వివరించారు.