NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మా’ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌ని హీరోలు వీరే !

1 min read

Mahesh Babu Venkatesh Photos in SVSC Telugu Movie

ప‌ల్లెవెలుగు వెబ్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో ప్రకాశ్ రాజ్ పై గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో చిరంజీవి, బాల‌కృష్ణ, మోహ‌న్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు పలువురు అగ్రహీరోలు, హీరోయిన్ లు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. చాలా మంది హీరోలు, హీరోయిన్లు ‘మా’ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌లేదు. వివిధ కార‌ణాల వ‌ల్ల వారు మా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌బాబు, తారక్‌, ప్రభాస్‌, రానా, నితిన్, నాగచైతన్య, అల్లు అర్జున్‌, శర్వానంద్‌, సునీల్‌, సుమంత్‌, సుశాంత్‌, సత్యదేవ్‌, అల్లు శిరీష్, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, రవితేజ, అనుష్క, రకుల్‌, త్రిష, హన్సిక, ఇలియానా, నిహారికతోపాటు పలువురు తారలు ఓటు వేసేందుకు హాజరు కాలేదు.

About Author