NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంతో పునీత్ రాజ్ కుమార్ చివ‌రి మాట‌లు ఇవే !

1 min read

పల్లెవెలుగు వెబ్​: క‌న్నడ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం పై క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పునీత్ చ‌నిపోయే ముందు రోజు త‌న‌తో మాట్లాడిన మాట‌లు ఆయ‌న గుర్తు చేసుకున్నారు. చ‌నిపోయే ముందు రోజు క‌ర్ణాట‌క టూరిజానికి సంబంధించిన ఓ వెబ్ సైట్ ఆవిష్కరించాల‌ని త‌న‌ను కోరిన‌ట్టు తెలిపారు. న‌వంబ‌ర్ 1న దానికి సంబంధించిన యాప్ విడుద‌ల చేయ‌బోతున్నాన‌ని చెప్పిన‌ట్టు గుర్తు చేసుకున్నారు. ఈ లోపు పునీత్ మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం షాకింగ్ గా ఉంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. కన్నడ రాష్ట్రం, క‌న్నడ చిత్రసీమ‌, క‌న్నడ యువ‌త ఆయ‌న‌ను మిస్ అవుతోంద‌ని అన్నారు. ఆదివారం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్రభుత్వ లాంఛ‌నాల‌తో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియ‌లు నిర్వహించ‌నున్నట్టు సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ప్రక‌టించారు.

About Author