సిలబస్ నుంచి సీబీఎస్ఈ తొలగించిన పాఠాలు ఇవే !
1 min readపల్లెవెలుగువెబ్ : సీబీఎస్ఈ 10, 11, 12 తరగతుల సిలబస్ నుంచి కొన్ని పాఠాలను తొలగించింది. 11, 12 తరగతుల సిలబస్ నుంచి అలీనోద్యమం, ప్రచ్ఛన్న యుద్ధ శకం, ఆఫ్రో-ఆసియన్ ప్రాంతాల్లో ఇస్లామిక్ రాజ్యాల ఎదుగుదల, మొఘలు కోర్టులు, పారిశ్రామిక విప్లవం అధ్యాయాలను ఉపసంహరించింది. చరిత్ర, రాజనీతి శాస్త్రం నుంచి వీటిని తొలగించింది. అదేవిధంగా పదో తరగతి సిలబస్‌లో కూడా మార్పులు చేసింది. ఆహార భద్రత అధ్యాయం నుంచి ‘వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం’ అంశాన్ని ఉపసంహరించింది. ఉర్దూ కవి ఫెయిజ్ అహ్మద్ ఫెయిజ్ రాసిన రెండు పద్యాల అనువాద భాగాలను, ప్రజాస్వామ్యం, వైవిద్ధ్యంపై అధ్యాయాలను కూడా తొలగించింది.