భారత్ లో అత్యంత పేద రాష్ట్రాలు ఇవే !
1 min readపల్లెవెలుగు వెబ్ : బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ దేశంలో అత్యంత పేద దేశాలని నీతిఆయోగ్ వెల్లడించింది. నీతి ఆయోగ్ తన తొలి జాతీయ బహుముఖీన పేదరిక సూచిక నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం బీహార్ జనాభాలో సగానికి పైగా పేదరికంలో ఉన్నారు. ఝార్ఖండ్ లో 42 శాతం, ఉత్తర ప్రదేశ్ లో 37 శాతం పేదరికంలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కేరళ, తర్వాతి స్థానాల్లో గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్ ఉన్నాయి. దేశంలో బహుముఖీన పేదరిక సూచికను తయారు చేయడానికి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి చేసిన మెథడాలజీని ఉపయోగించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ఆధారంగా తీసుకున్నట్లు తెలిపింది.
ReplyForward |