టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పశ్చిమ రాయలసీమ స్థానానికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ స్థానానికి కంచర్ల శ్రీకాంత్ అభ్యర్థిత్వాలను చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నం స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.