NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎర్రమట్టి తవ్వకాలపై … ఈ వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: వై.నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ప్యాపిలి పట్టణం లో  తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్  అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పంచాయతీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ప్యాపిలి పట్టణం 2వ వార్డ్ తెలుగుదేశం పార్టీ తరపున మెంబర్స్ గా హారతి ,కోట లక్ష్మీదేవి గారు నామినేషన్ వేయడం జరిగింది.ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్  మాట్లాడుతూ  ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలకు పన్నుల భారం తప్ప అభివృద్ధి కనిపించడం లేదు. ఇసుక, ఎర్రమటి మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి.ఎర్ర మట్టి తవ్వకాలు ఆపేది ఎప్పుడు అని వైసిపి నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎర్ర మట్టి తవ్వకాలు విపరీతంగా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్టున్నారు.ఎర్రమట్టి తవ్వకాలపై  ప్రజలకు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి.యదేచ్చగా ప్రతి గ్రామంలో ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపైన అధికారులు ఇప్పటికైనా స్పందించి కట్టడి చేయాలి.ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ , వెంకటేశ్వర్ రెడ్డి , నాగేంద్ర , పెద్ద రామాంజనేయులు , సుంకయ్య , మల్లికార్జున , మధు ,సుదర్శన్ , కోదండరామయ్యగారు, రామిరెడ్డి ,వలి , భూపాల్ రెడ్డి , అనుదీప్ , తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.

About Author