NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పువ్వు కోసం కొట్టుకు చ‌స్తున్నారు..వీళ్లని ఏమ‌నాలి ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ‌ గ్రామాల్లోని కులాలు, రాజకీయాలు మ‌ధ్య ఉండే గొడ‌వ‌లు, కొట్లాట‌లు ప్రధాన అంశంగా రూపొందిస్తున్న సినిమా అర్ధ శ‌తాబ్ధం. ది డెమెక్రటిక్ వ‌య‌లెన్స్ అనేది ఉప శీర్షిక‌. కార్తీక్ ర‌త్నం, కృష్ణ ప్రియ జంట‌గా సాయి కుమార్, రాజా రవీంద్ర, అజ‌య్, ఆమ‌ని, ప‌విత్ర లోకేష్ ప్రధాన తారాగ‌ణంగా తెర‌కెక్కుతున్న చిత్రం అర్ధ శ‌తాబ్ధం. త్వర‌లో ఆహా డిజిట‌ల్ ప్లాట్ ఫారమ్ మీద విడుద‌ల అవుతోంది. ఈ సినిమా ట్రైల‌ర్ ఈ రోజు ఆహో లో విడుద‌ల చేశారు. ‘ఒక్క పువ్వు కోసం కొట్టుకు చ‌స్తున్నారంటే నీకెందుక‌య్య అంత ఆశ్చర్యం, 50 ఏళ్ల స్వాతంత్ర్యం ఎవ‌రి కోస‌మో, దేని కోస‌మో ఇప్పటికీ ఎవ్వరికి అర్థం కాలేదు’ అనే శుభ‌లేఖ సుధాక‌ర్ డైలాగ్ తో ట్రైల‌ర్ విడుద‌ల అయింది. జూన్ 11 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.

About Author