PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మున్సిపల్ ఆదాయానికి గండికొడూతూ  దోపిడికి పాల్పడుతున్నారు..

1 min read

వారపు,దిన మార్కెట్ జాకాతులను  గెజిట్ ప్రకారం వసూలు చేసేలా చర్యలుతీసుకోవాలి…..

 సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్…

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు: మున్సిపాలిటీ పరిధిలో వారపు మార్కెట్లో గొర్రెలు,పశువులు,చికెన్ తదితర జకాతులను డైలీ మార్కెట్ లో చిరు వ్యాపారుల నుండి అక్రమా దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ  డివిజన్ కార్యదర్శి  రాజు, ఐ.ఎఫ్.టీ.యు  జిల్లా అధ్యక్షులు ప్రసాద్, పి.డి.ఎస్.యు  జిల్లా కార్యదర్శి మహేంద్ర బాబు డిమాండ్ చేశారు.  సోమవారం స్థానిక ఎమ్మిగనూరు   పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ గంగిరెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వారపు ,డైలీ మార్కెట్ రుసుము వస్తువుల వేలాలు దక్కించుకున్న వారు మున్సిపల్ గెజిట్ ప్రకారం వసూలు చేయకుండా గెజిట్ అతిక్రమించి వసూళ్లు చేస్తూ, ప్రజలను వేలం దారులు దోపిడీకి పాల్పడుతున్నారు. చిరు వ్యాపారులు వ్యాపారాలు లేక అల్లాడిపోతున్నారు. మున్సిపల్ వేలాలను తక్కువ ధరలకు దక్కించుకొని అధికంగా రుసుములు వసూళ్లకు పాల్పడి మున్సిపల్ ఆదాయాన్ని గండికొడూతూ ప్రజలను దోపిడికి పాల్పడుతున్నారు. కావున మున్సిపల్ వేలాలని మున్సిపల్ ఆదాయానికి గండి పడకుండా ప్రజలకు దోపిడీ చేయకుండా తగు చర్యలు తీసుకుని, వ్యాపార వర్గాలకు న్యాయం చేయగలరని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు కే .ఏసేపు, నాయకులు అగస్టిన్, నల్లన్న,అస్లాం, ప్రతాప్, హరి, లక్ష్మణ్, అంజి తదితరులు పాల్గొన్నారు.

About Author