అనుమతులు లేకున్నా…హాస్టల్ లను నడుపుతున్నారు
1 min readప్రభుత్వ నిబంధనలు పాటించని స్కూ హాస్టల్ లను రద్దు చెయాలి….( SFI )
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం మండల లో గత సంవత్సరాలనుండి నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా కొన్ని స్కూల్ లో హాస్టల్ లను నడుపుతన్నారని (SFI )మండల నాయకుడు బత్తిని ప్రతాప్ మాట్లాడుతూ అధికారులకు ముడుపులు అందచేస్తూ హాస్టల్ లను నడుపుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం గా ప్రవర్తిచడం వలన గతంలో ఒకటవ తరగతి విద్యార్థి సాంబారు అండలో పడి చనిపోవడం జరిగింది. అదేవిదంగా టీటీసీ చదువు తున్నటువంటి స్టూడెంట్ చనిపోవడం జరిగింది.మరి ఎన్ని సంఘటనలు జరిగిన అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్టు ప్రవర్తించడం చాల బాధాకరం పాణ్యం మండలలో చుట్టూ పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి అందులో వేల సంఖ్యలో విద్యార్తులకు మెరుగైన సంక్షేమ హాస్టల్ లను విద్యార్థులు కు అందుబాటులో ఏర్పాటు చేయాలని కోరుతున్నం ఇప్పటికైనా ఆ స్కూల్, హాస్టల్ లను రద్దు చేయాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(SFI) గా డిమాండ్ చేస్తూ ఈ రోజు స్పందన కార్యక్రమం లో తాసిల్దార్ మల్లికార్జున రెడ్డి, యమ్ ఈ ఓ, కోటయ్య, ఎంపీడీఓ దస్తగిరి గారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో విద్యార్థిలు మధు, సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.