PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్ధరాత్రి ఇసుక ను అక్రమంగా తోడేస్తున్నారు..

1 min read

– చోద్యం చూస్తున్న అధికారులు
– రైతుల పొలాల నుండి ఏకంగా హంద్రీ నది లోకిరహదారి
– పొలాలు దెబ్బ తింటున్నయని రైతుల ఆందోళన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అర్ధరాత్రి సమయంలో హంద్రీ నదిలో ఇసుక బకాసురులు అక్రమంగా తోడేస్తున్నారు. ప్రస్తుతం అసలే ఇసుకకు మంచి డిమాండ్ ఉండడంతో ఇక్కడ నుండి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కర్నూలు జిల్లా ఇసుక తరలి వెళుతోంది. ఇసుకకు రెట్టింపు రేటు కూడాఅక్కడ లభిస్తుంది. అందుకే ఎంత రిస్కు ఉన్న ఏదో విధంగా ఇసుకను తరలిస్తున్నారు. హంద్రీ తుంగభద్ర నదిలో లభించే సన్నటి మేలురకం ఇసుక ఏ జిల్లాలో ఎక్కడా దొరకదని అందరికీ తెలిసిందే. అందుకే కర్నూలు జిల్లా ఇసుకకు అంత గిరాకీ తో పాటు డిమాండ్ కూడా ఉంటుంది. ఈ ఇసుక బిల్డింగ్ కట్టడానికి ప్లాస్టరింగ్ కు చాలా ఉపయోగపడుతుంది. వేరే ఇసుక అయితే జల్లాడ పట్టు కోవాల్సి వస్తుంది. ఈ ఇసుక సన్నగా ఉన్న కారణంగా జల్లడల్లో పట్టకుండానే ఉపయోగపడుతుంది. కల్లూరు మండలంలో హంద్రీనీండా ఇసుక ఉండేది. ఎక్కువ తరలిచడం వల్ల ప్రస్తుతం ఇసుక కనిపించకుండా పోతుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ సమీపంలో ఉన్న నాయకల్లు గ్రామం నందు సర్వే నెంబర్ 43/12 పొలంలో 4సంవత్సరాలనుండి అక్రమంగా హంద్రీ ఇసుక తరలిస్తున్న సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించుకుంటేనే పంటలు చేతికొస్తాయని అలాంటిదే ఇక్కడ ఇసుక ట్రాక్టర్లు తిరుగుతుండడంతో దుమ్ము ధూళితో పంటలు సక్రమంగా పంటలు పండటం లేదని వాపోతున్నారు. అక్రమ రవాణా అంతా అర్ధరాత్రి ట్రాక్టర్లతో తోడేస్తూ తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలన్నీ అధికారులకు తెలిసిన వాళ్లు ఏమాత్రం పట్టించుకోవడంలేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా ముఠా దారులు. ఇప్పుడు వరకు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ దర్జాగా కాలం నిలదీస్తున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని రైతు డిమాండ్ చేస్తున్నారు. ఇసుకను అక్రమంగా అడ్డదారిలో రవాణా చేస్తున్న ఇసుక దొంగలపై నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా రైతుల పొలాలలో ట్రాక్టర్లు తిరిగే విధంగా దారి ఏర్పాటు చేసుకున్నారు. పొలాల నుండే ఈ దారి మీదుగా ట్రాక్టర్లు హంద్రీలోకి వెళ్తాయి. పచ్చని పంట పొలాలన్నీ పాడైపోతున్నాయని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అర్ధరాత్రి ఇసుక తరలించే విషయాన్ని సంబంధిత అధికారులకు రైతులు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించడం లేదు. ఇసుక ద్వారా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మొదటగా ఒక్క చిన్న ద్విచక్ర వాహనం పై వచ్చి పర్శిలీస్తూ ఆ తరువాత ట్రాక్టర్ ద్వారా తరలింపు గతంలో స్థానిక పొలందారులు పోలీస్ వారికీ పట్టించిన అలాంటి భయం లేకుండా తిరిగి వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని రైతుల వాపోతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై బలమైన కేసులు నమోదు చేస్తే వారికి భయం ఉంటుందని ఇక్కడ మాత్రం అలాంటి సంఘటనలు ఏమీ లేవని రైతులు చెబుతున్నారు. ట్రాక్టర్లు వెళ్లేందుకు వీలుగా అక్కడే ఉన్న మామిడి చెట్లు నాటిన తోటను కూడా నిప్పు పెట్టారని వాపోతున్నారు. ఈ నష్టాన్ని ఎవరూ భర్తీ చేస్తారని మామిడి తోట రైతు ఆందోళన చేస్తున్నాడు. పొలం నుంచి ఇసుక ట్రాక్టర్ రాకపోకలు ద్వారా పంట పొలం పనికిరాకుండా పోతుంది అని ఈ పొలాల నుండి ట్రాక్టర్లు వెళ్లకుండా ఆపగలిగితే మేలు చేకూరుతుందని రైతులు అంటున్నారు. హంద్రీలోకి వెళ్లేందుకు వారికి మరో దారి లేదని చెబుతున్నారు.రైతులు ఈ విషయం పై లబోదిబో అంటూ ఉన్న అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోవడం లేదు. అధికారులను కూడా అంతో ఇంతో డబ్బు అందచేస్తూ ఉంటారని సమాచారం.

About Author