ప్రజలకు ఏం చేశారని.. ఓటు అడుగుతారు..: టీజీ భరత్
1 min readబండిమెట్టలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన యువకులు
పల్లెవెలుగు, కర్నూలు:ఈ ఐదేళ్లు ప్రజలకు ఏం చేశారని రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని కర్నూలు నిజయోకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రశ్నించారు. నగరంలోని 3వ వార్డు బండిమెట్టలో వైఎస్సార్సీపీకి చెందిన ఇర్ఫాస్ తన బృందంతో కలిసి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీజీ భరత్ యువకులందరికీ పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారందరూ ఈ 30 రోజులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృష్టి చేయాలని కోరారు. తెలుగుదేశంతోనే మంచి భవిష్యత్ ఉంటుందని యువత ఆకర్షితులవుతున్నారని అన్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కర్నూలులో ఉన్న ముస్లింలందరికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత తనదని భరత్ హామీ ఇచ్చారు. ముస్లిం సోదరులు ఎవరూ అభద్రతా భావానికి గురవ్వద్దని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి సంక్షేమం, అభివృద్ధి అందుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో ఈదాస్, షాబీర్, నాసిర్, సాధిత్, నవాజ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నాగ వీరంజినేయులు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు తదితరు ముఖ్య నాయకులు, బూత్ ఇంఛార్జ్‌లు అందరూ పాల్గొన్నారు.