PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్నారు

1 min read

– ఆ మహిళపై దాడి చేయడం అవాస్తవం..
– నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: జిల్లా స్థానిక పాణంగి 14వ డివిజన్ లో గత 500 సంవత్సరాల నాటి పూర్వo గ్రామ దేవత విగ్రహ స్థల మరియు నివాస సరిహద్దు విషయంపై స్థానిక గ్రామస్తులు మరియు సరిహద్దు వారి ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తమ గ్రామంలో తమ పూర్వికులు సుమారు తాత ముత్తాతల యాళ్ల నాటి నుండి గ్రామ దేవతగా కొలువబడే ఈ ప్రదేశంలో నిత్య పూజలతో ప్రత్యేక సందర్భాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు పొందుతుంటారని తెలిపారు. అయితే దేవత స్థలానికి ఆనుకొని నివాసం ఉండే వ్యక్తి ఒంటెద్దు పోకడతో తమ ఇల్లు క్రేయ విక్రయాలకు గుడి ఇబ్బందిగా ఉందని భావించి అడ్డు తొలగించేందుకు పలుగుతో పెకిలించేందుకు సంసిద్ధమయ్యారని ఆ సందర్భంలో స్థానికంగా నివసించే వైసీపీ పార్టీకి చెందిన గ్రామస్తుడు గేదెల సూర్య ప్రకాష్ అడ్డుకొని ఇది సరియైన పద్ధతి కాదని గ్రామస్తుల సహకారంతో ఆ కుటుంబ సభ్యులను నివారించడంతో వారు గంట అరుణ మహిళను కొట్టి గాయపరిచారని తప్పుడు ప్రచారాలు చేస్తూ, బనాయించారని. పురుగుల మందు త్రాగినట్లు నానా హంగామా సృష్టిస్తున్నారని తెలిపారు, తన ఇంటి ప్రాంగణంలో సీసీ ఫుటేజీలు ఉన్నాయని అదే వాస్తవంగా నిరూపిస్తే తన రాజకీయ జీవితానికి స్వస్తి పలికేందుకు సంసిద్ధంగా ఉన్నానని ఆక్రోసం వ్యక్తం చేశారు, గ్రామంలో పార్టీ పరంగా తన ఎదుగుదలను చూసి ఓరవలేని కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ స్థానికంగా తాను ఐక్య మత్స్యంగా ఉండే వ్యక్తులతో ఇటువంటి వివాదాలు సృష్టిస్తున్నారన్న అనుమానాన్ని . అభిప్రాయాన్ని గ్రామస్తులతో కలిసి సూర్య ప్రకాష్ మీడియా ముందు వ్యక్తం చేశారు.

About Author