చేస్తామంటారు… చెయ్యరు..!
1 min readఅధికారుల నిర్లక్ష్యం పై కౌన్సిలరు ఆగ్రహం
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ప్రతి కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలను అధికారులు పరిష్కారం చేస్తామంటారు కానీ నెలలు గడిచినా సమస్యలు పరిష్కారం చెయ్యారంటూ 27వ వార్డు కౌన్సిలరు సమీరా భాను అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతననిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు.27వ వార్డులో లోవోల్టేజి విద్యుత్ సమస్యతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లోవోల్టేజి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆ శాఖ అధికారులకు తెలియజేసినా నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు ప్రజా సమస్యలు పట్టావా అంటూ నిలదీశారు. కాలనీలో పందుల బెడద ఎక్కువ ఉందని వాటిని తరలించడానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ కిషోర్ ను కోరారు.మురుగునీటి కాలువలను ఏర్పాటు చేయాలన్నారు.మురుగునీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయని కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. అనంతరం పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కమిషనర్ కిశోర్ లకు వినతిపత్రం అందజేశారు. వార్డు ఇంచార్జి వైసీపీ నాయకులు ఉస్మాన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.