లేని పొలం చూపించి పెన్షన్ పీకేశారు
1 min read– లోకేష్ ఎదుట వికలాంగుడి ఆవేదన
పల్లెవెలుగు వెబ్ ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం కడితోట శివార్లలో దూదేకుల ఇస్మాయిల్ అనే వికలాంగుడు యువనేత లోకేష్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నాడు.నాకు 3 ఎకరాలు పొలం ఉంటే, 30ఎకరాలున్నట్లుగా రికార్డుల్లో చూపి పెన్షన్ తీసేశారు.రికార్డుల్లో చూపిస్తున్న పొలం నాకు అప్పగించండి, పెన్షనైనా ఇవ్వండని అధికారులను అడిగా.ఎమ్మార్వో నుంచి కలెక్టర్ దాకా 16సార్లు అర్జీలు పెట్టుకున్నా, ఉపయోగం లేదు.సచివాలయానికి వెళితే నీకు పెన్షన్ రాదు పొమ్మంటున్నారు.ఇంతటి అరాచకమైన ప్రభుత్వన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. యువనేత లోకేష్ స్పందిస్తూ… అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.3వేలు చేస్తానన్న ముఖ్యమంత్రి మాటతప్పి మడమతిప్పాడు.భారం తగ్గించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల పెన్షన్లను కుంటిసాకులతో తొలగించారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వ అక్రమంగా తొలగించిన ఇస్మాయిల్ లాంటి వారి పెన్షన్లన్నీ పునరుద్దరిస్తాం.