కష్ట సమయంలో ఉన్నారు..మమ్మల్ని నిలబెట్టారు
1 min read
ఓర్వకల్లులో జన సంద్రమైన జన సైనికులు
ఫారం పాండ్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం భూమి పూజ
మీలాంటి యువతే లేకపోతే ఈ విజయం వచ్చేది కాదు
పూడిచెర్లలో డిప్యూటీ సీఎం పవన్..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : కష్ట సమయంలో మా వెంట నిలబడ్డారు కాబట్టే మీరు ఇలా మమ్మల్ని నిలబెట్టారని మీలాంటి యువతే లేకపోతే మాకు ఈ విజయం వచ్చేది కాదు ఈ విజయం మీ విజయమే అని కార్యకర్తల ను ద్దేశించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.శనివారం నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి 10:20 కి చేరుకున్న పవన్ కు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు అధికారులు ఘన స్వాగతం పలికారు.తర్వాత పూడిచెర్ల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద ఒక లక్ష 55 వేల ఫారం పాండ్ నీటి కుంటల నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం హాజరై భూమి పూజ చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి,నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు.తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మే చివరి లోపు నీటి కుంటల్లో నీళ్లు నిండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.8 నెలల్లోనే 4 వేల కిలోమీటర్ల రోడ్లను వేయించాం.నీటి కుంటలను రైతులు ఉపయోగిస్తూ వాటి చుట్టూ పండ్ల మొక్కలు పెంచుకోవాలని ఇప్పటివరకు 18,500 పశువుల షెడ్లు పూర్తి చేశాం.రైతుల అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.కర్నూలు జిల్లాలో 117 కి.మీ కు 75 కోట్లతో సిమెంట్ రోడ్లు వేయడంతో జిల్లా మొదటి స్థానంలో ఉండడం పట్ల కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషను ఉప ముఖ్యమంత్రి అభినందించారు. అనుభవజనులైన సీఎం చంద్రబాబు ఉండడం ఆయనను చూసి నేర్చుకోవడం నాకు అదృష్టంగా ఉంది.గతంలో ఎన్నడూ లేనంతగా పంచాయతీలకు పుష్కలంగా నిధులు ఇచ్చాం. వివిధ రకాల అర్జీలను అందజేయడానికి వచ్చిన వాటి అర్జీలను తీసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను అక్కడే ఆదేశించారు.సభలో ఈలలు కేకలు అరుపులతో సభ మార్మోగింది.సభలో చిరునవ్వులు చిందిస్తూ పవన్ కార్యకర్తలకు అభిమానం చేశారు.కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ,టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్,జేసీ నవ్య,మెగా ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ బాబు వివిధ శాఖల అధికారులు మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చారు.
