PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దొంగలు అరెస్టు బంగారం స్వాధీనం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఈనెల 16వ తేదీ మండల పరిధిలోని బూజునూరు గ్రామంలో రాత్రిపూట ద్వారం జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది.బాధితుడు, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి, మిద్దె పైకి పోయి నిద్రపోయి తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి కిందకు వచ్చి చూడగా హాల్ లో ఉన్న కిటికీకి ఉన్న స్క్రూ లను తీసి కిటికీ ద్వారా ఇంట్లో కి ప్రవేశించి బీరువాలో ఉన్న సుమారు 24.5 తులాల బంగారు నగలు మరియు సుమారు 26 తులాల వెండి నగలు దొంగిలించారు. బాధితుడు అదే రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు చేదించడానికి సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకొని కేసు చేదించి దొంగలు దొంగిలించిన సొమ్మును 100% రికవరీ చేసినట్టు గురువారం నాడు నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దొంగలను అరెస్టు చేసి సొమ్మును రికవరీ చేసినట్టు జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి, తెలిపారు మేరకు ఎస్డిపిఓ C. మహేశ్వర రెడ్డి పర్యవేక్షణ లో పాణ్యం, సీఐ ఎస్సై వెంకటసుబ్బయ్య., వారి సిబ్బంది ఈ కేసులో ముద్దాయి లు అయిన గోగుల రవీంద్ర బాబు,, పెద్ద కొట్టాల గ్రామం. అల్లూరి బాల దస్తగిరి @ బాలు,, జ్ఞానాపురం, గడివేముల గ్రామ శివారులో అరెస్టు చేసి వారి నుండి పైన తెలిపిన బంగారు మరియు వెండి వస్తువులను మరియు నేరములో ఉపయోగించిన మోటార్ సైకల్ మరియు స్క్రూ డ్రైవరు, ఐరన్ రాడ్డు లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.ఈ కేసులో పరారీలో ఉన్న ముద్దాయి గోగుల పెద్ద సుబ్బరాయుడు పెద్ద కొట్టాల గ్రామము, నంద్యాల మండలము, ప్రస్తుతం హనీఫ్ నగర్, నంద్యాల టౌన్ ను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

About Author