కిటికీచూవ్వలు విరగొట్టి నగదు, బంగారు, వెండి దోచుకెళ్లిన దుండగులు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : తాళం వేసిన ఇండ్ల పైనే దృష్టి పెట్టిన దుండగులు మండలంలో జోరుగా చోరీలకు తెగబడుతున్నారు. ఇటీవల మండలంలోని రామనపల్లి గ్రామంలో పట్టపగలే ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు లాకెళ్ళిన సంఘటన మరువకముందే మంగళవారం చెన్నూరు పాత బ్యాంకు వీధిలో మరో దొంగతనం సంఘటన చోటు చేసుకుంది. చెన్నూరు పాత బ్యాంకు వీధిలో నివాసం ఉంటున్న పెడబల్లె రాజేశ్వరమ్మ అనే మహిళ ఇంటిలో దొంగలు చొరబడి ఇంటిలో ఉన్న బంగారు, నగదు, వెండి దోసుకెళ్లినట్లు పోలీసు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు పాత బ్యాంకు వీటికి చెందిన పెడబల్లె రాజేశ్వరమ్మ భర్త మృతి చెందడంతో ఆమె ఒక్కటే ఒంటరిగా ఇంట్లో ఉండలేక తన కుమారుడు హైదరాబాదులో ఉండడంతో ఆమె కుమారుని వద్ద ఉండేదని తెలిపారు. అయితే రాజేశ్వరమ్మ ప్రభుత్వం ఇచ్చే సామాజిక వితంతు పెన్షన్ కొరకు ప్రతి నెల ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకుని వెళ్లేదని తెలిపారు. అదే క్రమంలో అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చిన రాజేశ్వరమ్మ ఇంటి తాళం తీసి ఇంటిలోకి వెళ్ళగా ఇంట్లో సామానులు, బట్టలు చల్లాచదురుగా పడి ఉండడం చూసి కంగారుగా ఇంటిలోని బీరువాను పరిశీలించగా బీరువా పగలగొట్టి బీరువాలో ఉన్న 80 వేల రూపాయలు నగదు, 50 గ్రాముల బంగారు నగలు, అలాగే ఒకటిన్నర కేజీ వెండిని దొంగలు దోసుకెళ్లినట్లు ఆమె గుర్తించడం జరిగిందన్నారు. దుండగులు ఇంటి కిటికీచువ్వలు తొలగించి ఇంటిలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.