NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లక్ష్మీ నగర్లో దొంగలు పడ్డారు

1 min read

– లక్షా నలభై వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణం లక్ష్మీ నగర్ కాలనీలో బుధవారం రాత్రి ఇంట్లోకి చొరబడి 80 వేల నగదు చోరీ చేసిన సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మీ నగర్ లో నివాసముండే పుల్లయ్య అనే రోజువారి కూలీ బ్రతకడానికి వేరే ప్రాంతానికి కుటుంబంతో సహా వలస వెళ్లాడు. ఇంట్లో నగదును దాచి తాళాలు వేసి వెళ్లారు. అయితే దొంగలు ఇదే అదనుగా భావించి బుధవారం రాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని ఒక లక్ష 40 వేలు నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్ళినట్లు బాధితుడు పుల్లయ్య తెలిపారు. అలాగే నగదు తో పాటు ఏటీఎం కార్డును కూడా దొంగలించి అందులోని తొమ్మిది వేల రూపాయలను డ్రా చేసుకున్నట్లు బాధితుడు తెలిపాడు. ఏటీఎం నుండి 9000 డ్రా అయినట్లు ఫోన్ కు మెసేజ్ రావడంతో తన ఏటీఎం కార్డు దొంగలించబడిందని పసిగట్టి మిగతా 20 వేల రూపాయలను వేరే అకౌంట్ కు జమ చేసినట్లు బాధితుడు చెప్పాడు. ఈ మేరకు తన ఇంట్లో చోరీ జరిగినట్లు ఏటీఎం కార్డు దొంగలు ఎత్తుకెళ్లినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ కాబడ్డ ఇంటి దగ్గరకు చేరుకొని చోరీ జరిగిన తీరుపై పరిశీలన చేశారు.

About Author