పత్తికొండలో దొంగల హల్ చల్ …
1 min readపోలీసులకు సవాలుగా నిలుస్తున్న వరుస దొంగతనాలు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాత్రి వేళల్లో ఇళ్లలో దూరి చోరీలకు పాల్పడుతున్న వైనం, పోలీసులను వీడని మొద్దు నిద్ర తూ,తూ మంత్రంగా పోలీసుల విచారణ చోరీ సొమ్మును రికవరీ చేయలేక చేతులు ఎత్తేస్తున్న పోలీసు లు గగ్గోలు పెడుతున్న బాధితులు పత్తికొండ, పల్లె వెలుగు. కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిసర ప్రాంతాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో బీగాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగలు ఇళ్లలో ఉన్న నగదు బంగారు విలువైన సామాగ్రితో ఉడయిస్తున్నారు. దొంగతనాలు అరికట్టాల్సిన పోలీసులు ఏమి చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు.దొంగతనం జరిగిన తర్వాత తూ,తూ మంత్రంగా విచారణ చేస్తున్నారు తప్ప, చోరీకి గురైన సొమ్మును రికవరీ చేయలేక పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.గత కొంతకాలంగా పత్తికొండలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాలుగా నిలుస్తున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మొద్దు నిద్ర వీడటం లేదని బాధితులు వాపుతున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు తప్ప దీనిపై పోలీసుల స్పందన అంతంత అంతంత మాత్రమేనని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పత్తికొండ పట్టణం లక్ష్మీ నగర్ లో ఒకేరోజు మూడు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇంతవరకు చోరీకి గురైన సొమ్మును రికవరీ చేసి ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. సోమవారం రాత్రి కూడా పత్తికొండ పట్టణం నడిబొడ్డులో ఉన్న సవరమ్మ కాలనీ ఆదోని రోడ్డు ప్రక్కన పాత పెట్రోల్ బంక్ వెనుక వైపు ఉన్న ఇళ్లలో దొంగలు పడి నగదు, బంగారు నగలు దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వేసిన బీగాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల నగదు దొంగలు దోచుకెళ్లారు.పత్తికొండ టౌన్ పాత పెట్రోల్ బంకు వెనక వున్న కురువ అనసూయమ్మ w/o కురువ హనుమంతు ఇంటిలో దొంగలు పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని , విచారణలో భాగంగా క్లూస్ టీంను రప్పించి దొంగతనం సంఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు పత్తికొండ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలు అరికట్టి, చోరీకి గురైన తమ సొమ్మును రికవరీ చేసి ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.