రెండు నెలల్లో థర్డ్ వేవ్.. ప్రొఫెసర్ అంచనా
1 min read
పల్లెవెలుగు వెబ్ :కరోన వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో దేశంలో స్వల్ప స్థాయిలో థర్డ్ వేవ్ కనిపించనుందని, ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయిని చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. వచ్చే ఏడాది జనవరిలో కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించవచ్చని.. అదే సమయంలో పంజాబ్, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికలు కూడ జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయినప్పటికీ వైరస్ కట్టడి చర్యల ద్వార థర్డ్ వేవ్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.