‘డెల్టా ప్లస్ ’ తో థర్డ్ వేవ్.. వైద్యుల హెచ్చరిక
1 min readపల్లెవెలుగు వెబ్: డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుకున్నట్టుగా… థర్డ్ వేవ్ వస్తే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. సెకెండ్ వేవ్ లో వచ్చిన కేసుల సంఖ్య కంటే అధికంగా ఉంటాయని మహారాష్ట్ర కు చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే సెకెండ్ వేవ్ ముగిసే లోపు థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలని కోరుతున్నారు.