దాహం తీరడంలేదా..? ఇలా చేయండి
1 min readపల్లె వెలుగు వెబ్: ఎండాకాలం దప్పిక అధికంగా ఉంటుంది. ప్రతి 30 నిమిషాలకు తప్పకుండా నీటిని తీసుకోవాలి. ఎంత అధికంగా విడతల వారీగా నీటిని తీసుకుంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీటిని ఇవ్వకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. కొంత మందిలో ఎంత నీరు తాగినా సరే దప్పిక సమస్య తీరదు. అలాంటి వారు .. ఇలా ఫాలో అవ్వండి.
ఏం చేయాలి..?
- తాజ పండ్ల రసాలను తాగండి.
- కర్బూజ, పుచ్చ, దోస, నారింజ, బత్తాయి రసాలను తాగండి.
- కొబ్బరి నీళ్లు, మజ్జిగ వీలైనన్ని సార్లు తాగాలి.
- బీర, దోస, పొట్ల కాయలను ఆహారంలో చేర్చుకోండి.
ఏం చేయకూడదు..? - పండ్ల రసాలను తీసుకునే సమయంలో తీపి కోసం చెక్కర కలపకూడదు.
- పండ్ల రసాలను తాజాగా తీసుకోవాలి. ఫ్రిజ్ లో ఉంచకూడదు.
- ఘనపధార్థాలు తక్కువగా తీసుకోవాలి.
- ఆహారాన్ని ఎక్కవ సార్లు కొద్ది కొద్దిగా తీసుకోవాలి.
- ఎప్పటికప్పుడు వండుకొని తినాలి. నిల్వ ఉంచరాదు.
- మసాలాలు, నూనె వంటలు తగ్గించాలి.