విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పై ఇంఛార్జి ఏఈ దాడి దారుణం..: రామాంజులు
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి/వీరబల్లి: షిఫ్ట్ ఆపరేటర్ మల్లిఖార్జున మీద జరిగిన దాడిని ఖండిస్తూ, అకారణం గా కొట్టిన ఇంచార్జీ ఏ ఈ శ్యాంప్రసాద్ రావు ను విదుల నుండి తొలగించాలని సీ ఐ టీ యు జిల్లా కార్యదర్శి ఎ. రామాంజులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక విద్యుత్ డివిజనల్ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ వీరబల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో గత 15 సంవత్సారాలు గా కాంట్రాక్టు కార్మికునిగా విధులు నిర్వర్తించే షిఫ్ట్ ఆపరేటర్ మల్లిఖార్జున మీద మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఇంచార్జ్ ఏ ఈ శ్యామ్ ప్రసాద్ రావు మందు తాగి వచ్చి మల్లిఖార్జున ను నారూం తాళం చెవి అడిగాడు. నా దగ్గర లేవని మల్లిఖార్జున చెప్పడం తో అకారణంగా, అన్యాయంగా ఆవేశంగాఎందుకులేవంటు ఇంచార్జీ ఏ ఈ గారు మల్లిఖార్జున ను ఇష్టానుసారంగా ముఖంపై, వీపు మీద కొట్టాడు ఉచ్చారించ డానికి , రాయడానికి వీలు లేని భాష లో తిట్టి మానసిక ఒత్తిడికి గురిచేసిన ఇంఛార్జి ఏ ఈ మీద కటిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి పిర్యాదు చేశామన్నారు. ఇంచార్జీ ఎ ఈ శ్యామ్ ప్రసాద్ రావు కార్మికులను ఉద్యోగులను ఎక్కడా ఎప్పుడూ గౌరవించడం లేదన్నారు. ఈయన గారి అహంకార ఆగడాలతో వీరబల్లి లో పనిచేస్తున్న విద్యుత్ రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులు ఎవరికి చెప్పుకోలేక తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు ఆని పేర్కొన్నారు. నందలూరు లో జె ఈ గా పని చేసేటప్పుడు కూడ ఇతని ప్రవర్తన మీద అలిగేషన్స్ ఉన్నాయన్నారు. ఇలాంటి వారు విద్యుత్ సంస్థ కు చేటు అన్నారు. విధి నిర్వహణ లో ఎవరన్నా పోన్ చేసినా,చేయకపోయినా ఆయనతో వంకర మాటలు పడాల్షిందేనన్నారు. మల్లిఖార్జున కు న్యాయం జరిగే వరకు సీ ఐ టీ యు పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాదిత షిఫ్ట్ ఆపరేటర్ మల్లిఖార్జున, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ డిస్కం కార్యదర్శి సుబ్రమణ్యం రాజు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్ పలువురు వీరబల్లి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.