PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ కారును అంద‌రికీ అమ్మరు.. ఎందుకంటే ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రోల్స్ రాయిస్ కారు.. ప్రపంచంలోనే ఉన్నత శ్రేణి కార్లలో ఒక‌టి. అలాంటి ఈ కారును కొన‌డానికి డ‌బ్బుంటే స‌రిపోదు. ఈ సంస్థ కారును ఎవ‌రికంటే వారికి అమ్మదు. అందుకోసం కొన్ని క‌చ్చితమైన నిబంధ‌న‌లు పాటిస్తుంది. కారు బుక్ చేసుకున్న క‌స్టమ‌ర్ వ్యక్తిగ‌త ప్రొఫైల్, స‌మాజంలో అత‌ని స్థాయి, దాన్ని న‌డ‌ప‌బోయే డ్రైవ‌ర్ వివ‌రాలతో స‌హా అన్నింటిని రోల్స్ రాయిస్ సంస్థ ప‌రిశీలిస్తుంది. సాధార‌ణంగా చాలా కంపెనీల కార్లు కొన్ని ర‌కాలు రంగులు, షేడ్స్ లో మాత్రమే దొరుకుతాయి. కానీ రోల్స్ రాయిస్ కారు 44,000 షేడ్స్ లో దొరుకుతుంది. ఎవ‌రైన ఒక వినియోగ‌దారుడు ఒక రంగు కారుకు వేయించుకుంటే.. అత‌ని పేరు మీద ఆ రంగు రిజిష్టర్ చేయిస్తుంది. ఇంకెవ‌రైన ఆ రంగు వేయించుకోవాలంటే .. ఆ రంగు రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న య‌జ‌మాని అనుమ‌తి అవ‌స‌రం. ఎక్కడ ప‌డితే అక్కడ ఆ రంగు మార్చుకోవాలంటే సాధ్యం కాదు. రోల్స్ రాయిస్ సంస్థే త‌మ ఉద్యోగిని పంపి మరీ రంగు వేయిస్తుంది. రోల్స్ రాయిస్ కారు సొంతం చేసుకోవాలంటే డ‌బ్బుతో పాటు, అదృష్టం కూడ ఉండాల‌ని అంటారు.

About Author