NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ ఎంజైమ్ ప్లాస్టిక్ ను తినేస్తుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్లాస్టిక్ వ్య‌ర్థాలు భూమిపై పేరుకుపోతున్నాయి. వీటి మూలంగా ప‌లు జంతు జాతుల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ప్లాస్టిక్‌ సంపూర్ణంగా డీకంపోజ్‌ కావడానికి సుమారు 500– 1000 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి స‌మ‌యంలో మోంటానా, పోర్ట్స్‌మౌత్‌ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఓ ఎంజైమ్ ను గుర్తించారు. ఇది గుట్టుచ‌ప్పుడు కాకుండా ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను తినేస్తుంది. దీని వివ‌రాలు ద ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్ లో ప్ర‌చురించారు. పీఈటీ ప్లాస్టిక్‌లో అణువులను విచ్ఛిన్నం చేసే ఒక ఎంజైమ్‌ను గుర్తించడం కీలకమలుపని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్‌ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా కేవలం సదరు ప్లాస్టిక్‌ను డీకంపోజ్‌ చేయడమే కాకుండా పలు రకాల ఉపయోగకర రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుందని సైంటిస్టులు వివరించారు. డైమండ్‌ లైట్‌ సోర్స్‌లో ఎక్స్‌ కిరణాలను ఉపయోగించి టీపీఏడీఓ ఎంజైమ్‌ 3డీ నిర్మితిని రూపకల్పన చేయడంలో విజయం సాధించినట్లు మెక్‌గెహాన్‌ చెప్పారు. దీనివల్ల ఈ ఎంజైమ్‌ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయవచ్చన్నారు.

                                          

About Author