NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ క‌ళ్ల‌జోడు 100 నిమిషాల వీడియో రికార్డ్ చేస్తుంద‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ టెక్నాలజీ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. అగ్‌మెంటెడ్ రియాలిటీతో ‘మిజియా ఏఆర్‌ గ్లాసెస్ కెమెరా ‘ స్మార్ట్‌ గ్లాస్‌ను విడుదల చేసింది. రూ.29,030 విలువైన మిజియా ఏఆర్‌ గ్లాసెస్‌లో డ్యుయల్‌ కెమెరా సెటప్‌, 50 మెగా పిక్సెల్‌ క్వాడ్ బేయర్ సెన్సార్లు, 8మెగా పిక్సెల్‌ పెరిస్కోపిక్‌ టెలిఫోటో కెమెరా, ఐఓఎస్‌ ఆప్టికల్‌ స్టెబిలైజేన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ సపోర్ట్‌ చేస్తుండగా 15ఎక్స్‌ హైబ్రిడ్‌ వరకు జూమ్‌ చేసుకోవచ్చని షావోమీ ప్రతినిధులు వెల్లడించారు.100గ్రాముల బరువు ఉండే ఈ స్మార్ట్‌ గ్లాస్‌ పనితీరులో అమోఘమని షావోమీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ గ్లాస్‌లో ఉన్న కెమెరాలు ఫోటోల్ని తీయడం, షేర్‌ చేయడం సెకన్లలో జరిగిపోతాయని స్పష్టం చేసింది. ఈ గ్లాస్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే 100 నిమిషాల వీడియో పుటేజీని నాన్‌ స్టాప్‌గా రికార్డ్‌ చేస్తుందని షావోమీ సీఈవో లీ జూన్ చెప్పారు.

                                    

About Author