PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ ప్రభుత్వం మీది.. ఉద్యోగ సంఘాలతో జగన్

1 min read

పల్లెవెలుగువెబ్ : మంత్రుల కమిటీతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ ను కలిశాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మీదని ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. మీ సహకారంతోనే ప్రజలకు మంచి చేయగలుగుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కరోనా వల్ల ఉద్యోగులు ఆశించినంత ఇవ్వలేకపోవచ్చుని, ఎంత మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశామన్నారు. రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుందన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు తావు ఉండకూడదన్నారు.

        

About Author