PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇది మైనారిటీ పిల్లల హక్కును కాలరాయడమే

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: CBSE అఫిలియేటెడ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఉర్దూ మరియు కన్నడ విద్యార్థులకు 2 వ భాషగా ఉర్దూ / కన్నడ తీసుకోవడానికి అవకాశం ఇప్పించుట గురించి.ఈ విద్యా సంవత్సరం నుండి CBSE అఫిలియేటెడ్ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి. ఈ చదువుతున్న విద్యార్థులకు CBSE ప్యాట్రన్ ఎక్సాంస్ కొరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇందులో ఉర్దూ. మరియు కన్నడ మీడియంలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు వీళ్ళు ప్రథమ భాషగా ఇంగ్లీష్ ద్వితీయ భాషగా తెలుగు తీసుకోవాలని ఆదేశించియున్నారు. ఇది వీళ్ళకు ఇబ్బందిగా మారింది.1వ తరగతి నుండి 9 వ తరగతి వరకు ఉర్దూ, కన్నడ ను ప్రథమ భాషగా చదివిన వీళ్ళను ఉ న్నపళంగా ఇంగ్లీష్, తెలుగు చదవండి ఉర్దూ, కన్నడ వద్దు అని చెప్పడం ఎంతవరకు సమంజసం ? ఇది మైనారిటీ పిల్లల హక్కును కాలరాయడమే అవుతుంది. ఉర్దూ ను 2 వ అధికార భాషగా గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం అంతలోనే ఉర్దూ భాషను ఇలా విస్మరించడం ఎంతవరకు సమంజసం ?. కన్నడ ను ఒక భాషగా చదివిన విద్యార్థులకు మన రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉద్యోగవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా కోల్పోతాం.కనుక తమరు విద్యాశాఖా ఉన్నతాధికారులతో మాట్లాడి ఉర్దూ మరియు కన్నడ మీడియం పిల్లలకు 2 వ భాషగా ఉర్దూ మీడియం పిల్లలకు ఉర్దూ ను, కన్నడ మీడియం పిల్లలకు కన్నడ ను తీసుకోవడానికి అవకాశం కల్పించాలి ఆ అవకాశం లేకపోతే ఉర్దూ, కన్నడ మీడియం విద్యార్థులకు CBSE సిలబస్ నుండి మినహాయింపు ఇప్పించాలని మన పిల్లల తరపున మనము తమను కోరుతున్నాము.స్వచ్ఛంద సంస్థల నాయకులు శివ శంకర్ గౌడ్, ఎంపీపీ ఈసా, అబ్దుల్ హమీద్, అతావుల్లా, రుద్ర గౌడ్, గవి, ఎం షఫీ , శివ కుమార్ గౌడ్, సిద్ధప్ప, శరణ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

About Author