PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2024లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఇది శ్రీకారం

1 min read

– నందికొట్కూరు లో తెలుగు తమ్ముళ్లు విజయోత్సవ సంబరాలు
– రాష్ట్రంలో తాలిబన్ల పరిపాలన నడుస్తోంది
– ప్రజల్లో ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకత
– ఎమ్మెల్సీల గెలుపుతోనే వైఎస్సార్సీకి రోజులు దగ్గరపడ్డాయి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగుదేశంపార్టీ బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయంసాధించడంపట్ల నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలర్ గుంజ్జుపల్లి భాస్కర్ రెడ్డి , ఐటీడీపి నియోజకవర్గ అధ్యక్షుడు మూర్తుజావలి, మైనార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు సంబరాలలో ముని గిపోయారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.భూమిరెడ్డి గెలుపుతో టి.డి.పిలో జోష్ నింపింది అని అన్నారు. పట్టభద్రులు సరైన తీర్పు నిచ్చారని ప్రజాతీర్పు ఎవ్వరైనా గౌరవించాల్సిందేనని ఈ గెలుపు 2024 టిడిపి గెలుపు శ్రీకారం అని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే సాధారణ ఎన్నికలలో సైతం రాష్ట్రంలోని ప్రజలు నిరుద్యోగులు, పట్టభద్రులు తెలుగుదేశంకి పట్టంకడతారని విజయానికి ఇది ముందస్తు సూచనగా పట్టభద్రుల తీర్పు కనిపిస్తుందని అన్నారు.పక్షిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్ధానంలో తమపార్టీ బలపరచిన అభ్యర్థి అత్యధిక మెజారిటీ సాధించడం ఉత్సాహాన్ని నింపిందని అలాగే రాష్ట్రంలో అధికారపార్టీ ఆగడాలకు పట్టభద్రులు అడ్డుకట్టవేసేల భూమిరెడ్డి ని గెలిపించడం మార్పుకు శ్రీకారంచుట్టిందన్నారు.ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి ని గెలిపించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, పిడిఎఫ్ అభ్యర్థులకు, జనసేన పార్టీ నాయకులకు, సిపిఎం, సిపిఐ నాయకులకు, బిజెపి పార్టీ, ఇతర పార్టీనాయకులకు, పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వైకాపా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగి వేసారి పోతున్న రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత చూపుతున్నారని రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతోనే వైకాపా పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, సీఎం పీఠం కోసం ప్రజలకు ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చేసిన జగన్ సీఎం అయ్యాక వాటిని పక్కన పెట్టి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రాష్ట్రంలో తాలిబన్ల పరిపాలన కొనసాగిస్తున్నట్లుందని తెలిపారు. సీఎం అయిన వారం రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యం నిషేధం అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు అని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్న కార్పొరేషన్లు పూర్తిగా తొలగించి వారికి అన్యాయం చేయడం జరిగిందన్నారు. 45 సంవత్సరాలు నిండినఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేదలకు పింఛను సరఫరా చేస్తానని హామీ ఇచ్చి ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. ఉన్న పాఠశాలలను కూడా మూసివేస్తూ విదేశీ విద్య కూడా రద్దు చేసిన ఘనత జగన్కు దక్కిందన్నారు. ఎన్నికల ముందు రైతులు పండించిన పంటలను ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చి వాటిని కొనుగోలు చేసే పనులు పక్కన పెట్టి రైతుల బోర్లకు మీటర్లు బిగించే పనులు చేస్తూ రైతులనుఇబ్బందుల పాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని అందుకు సంబంధించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తానని రాష్ట్రంలోని నిరుద్యోగులను నమ్మించి నాలుగు సంవత్స రాలు అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఉన్న పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరిమికొడుతూ రాష్ట్రంలో మరింత నిరుద్యోగిత పెంచుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రశ్నించిన వారిపై పోలీసుల ద్వారా కేసులు పెట్టడం, గూండాల ద్వారా దాడులు చేయడం, భూ కబ్జాలు,ఇసుకదందాలుపెట్రేగిపోతున్నాయన్నారు. ప్రజల ధనాన్ని దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి, ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల రాజన్న, టిడిపి నాయకులు జాకీర్, శాలు, నిమ్మకాయల మోహన్, కళాకర్, నిమ్మకాయల రాజు, ఖాళీల్ బేగ్, కార్యకర్తలు, అభిమానులు,, తదితరులు పాల్గొన్నారు.

About Author