సాయితేజ్ తాజా హెల్త్ బులెటిన్ ఇదే !
1 min readపల్లెవెలుగు వెబ్ : బైక్ స్కిడ్ అవ్వడంతో తీవ్రంగా గాయపడ్డ ప్రముఖ నటుడు సాయి తేజ్.. క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘ సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నాం’ అని అపోల్ వైద్యులు తెలిపారు. మరికొన్నిగంటలు ఐసీయూలోనే చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో సాయితేజ్ చికిత్స కొనసాగుతోంది. ఆదివారం కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది.