NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ఇదే !

1 min read

పల్లెవెలుగు వెబ్​: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు వైసీపీ అభ్యర్థుల‌ను ప్రక‌టించింది. ఈ మేర‌కు ప్రభుత్వ ప్రధాన‌కార్యద‌ర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి మీడియా స‌మావేశంలో ప్రక‌ట‌న చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు 50 శాతం సీట్లు కేటాయించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి ర‌ఘురాజు, విశాఖ‌పట్నం నుంచి ఒరుదు క‌ళ్యాణి, వంశీకృష్ణయాద‌వ్, తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి అనంత‌బాబు, కృష్ణా జిల్లా నుంచి త‌ల‌శిల ర‌ఘురామ్, మెండితోక అరుణ్ కుమార్, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు, మురుడుగు హ‌నుమంత‌రావు, ప్రకాశం జిల్లా నుంచి మాధ‌వ‌రావు, అనంత‌పురం జిల్లా నుంచి వై. శివ‌రామిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి భ‌ర‌త్ ను సీఎం జ‌గ‌న్ ఎంపిక చేసిన‌ట్టు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి మీడియా స‌మావేశంలో తెలిపారు.

About Author