ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం ఇదే !
1 min read
పల్లెవెలుగు వెబ్ :ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో టెల్ అవివ్ నగరం మొదటిస్థానంలో నిలిచింది. టెల్ అవివ్ నగరం ఇజ్రాయిల్ దేశంలో ఉంది. ఎకనామిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్ అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఆగస్టు, సెప్టంబర్ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల్లోని నిత్యావసర వస్తువుల ధరలు, అద్దె, రవాణ తదితర ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో ఫ్రాన్స్, సింగపూర్ సమాన పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. గత ఏడాది పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో వరుసగా మొదటి, రెండో, మూడో స్థానంలో నిలిచాయి.