NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ ష‌ర్మిల పార్టీ పేరు ఇదే.. అధ్యక్షుడు ఎవ‌రంటే..!

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: వైఎస్ షర్మిల పార్టీ పేరు దాదాపు ఖ‌రారైంది. గ‌త సంవ‌త్సరం డిసెంబ‌రులోనే ఎన్నిక‌ల సంఘానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ మేర‌కు వైసీపీ గౌర‌వ అధ్యక్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ ఇచ్చిన నోఅబ్జక్షన్ స‌ర్టిఫికేట్ ను ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైటీపీ)గా ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. పార్టీ అధ్యక్షుడిగా వాడుక రాజ‌గోపాల్ వ్యవ‌హ‌రిస్తారు. ప్రధాన‌కార్యద‌ర్శిగా సీహెచ్ సుధీర్ కుమార్, కోశాదికారిగా నూక‌ల సురేష్ వ్యవ‌హ‌రిస్తార‌ని ద‌ర‌ఖాస్తులో పేర్కొన్నటు ఎన్నిక‌ల సంఘం వెల్లడించింది. ఈసీ నుంచి అధికారికంగా లేఖ వ‌చ్చిన త‌ర్వాత వైఎస్ ష‌ర్మిల‌ను అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారు.

About Author