విటమిన్ డి ఆవశ్యకత ఇదే !
1 min readపల్లెవెలుగువెబ్ : విటమిన్ డి.. మన శరీరానికి అత్యంత ఆవశ్యక పోషకాలలో ఒకటి. ఎముకలు, దంతాలు బలంగా ఉండటంతోపాటు మన శరీరంలో చాలా జీవక్రియలకు విటమిన్ డి అత్యవసరం. ఇది ఆహారం ద్వారా దొరికే అవకాశాలు చాలా తక్కువ. మన చర్మంపై సూర్యరశ్మి పడినప్పుడు.. విటమిన్ డి తయారవుతుంది. అందుకే దీనిని సన్ షైన్ విటమిన్ అని కూడా పిలుస్తుంటారు. అయితే మారిన జీవన శైలి, పొద్దంతా ఆఫీసులు, స్కూళ్లకే పరిమితమయ్యే పరిస్థితిలో.. శరీరానికి ఎండ తగలడం తగ్గిపోయింది. ఈ క్రమంలో మన శరీరానికి విటమిన్ డి అందే మార్గాలను వైద్య, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ వ్యక్తులకు రోజుకు 15 మైక్రోగ్రాముల విటమిన్ డి అవసరం. ఎదిగే పిల్లలకు, గర్భిణులకు, 70 ఏళ్లుపైబడిన వారికి రోజుకు 20 మైక్రోగ్రాముల వరకు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వివిధ పరిశోధనల లెక్క ప్రకారం.. మనం తీసుకునే సాధారణ ఆహారం నుంచి రోజుకు 2.3 మైక్రోగ్రాముల నుంచి 2.9 మైక్రోగ్రాముల వరకు మాత్రమే శరీరానికి అందుతుందని వివరిస్తున్నారు. మిగతా విటమిన్ డి సూర్యరశ్మి ద్వారానే శరీరంలో తయారవుతుందని చెబుతున్నారు.