NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ కొత్త కేబినెట్ ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ నూతన మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గంలోకి 10 మంది పాత వారికి అవకాశం కల్పిస్తూ… 15 మంది కొత్తవారు రాబోతున్నారు. పాత, కొత్త కలయికతోనే కేబినెట్‌ ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాత మంత్రుల్లో కొంత‌మందిని కేబినెట్ లోకి తిరిగి తీసుకుంటార‌ని తెలుస్తోంది. వారిలో ప్ర‌ధానంగా అప్పలరాజు, వేణుగోపాల కృష్ణ, ఆదిమూలపు సురేష్‌, గుమ్మనూరు జయరాం, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, అంజాద్‌బాషా, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

కొత్త పేర్లు :
ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్‌, విడదల రజనీ, రాజన్న దొర, కాకాణి గోవర్దన్‌రెడ్డి, మేరుగ నాగార్జున, పార్థసారథికి గానీ. కారుమూరి నాగేశ్వరరావుకి గానీ ఇద్దరిలో ఒకరికి అవకాశం.., గుడివాడ అమర్నాథ్‌, ధనలక్ష్మి, బీసీల కోటా పెంచుతామని సజ్జల తెలిపారు. కాపు, రెడ్డి సామాజిక వర్గాల్లో గతంలో 4 పదవులు, ఇప్పుడు 3 పదవులు ఇస్తున్నట్లు సజ్జల పేర్కొన్నారు.

                                 

About Author