NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌రోనా… కొత్త ల‌క్షణం ఇదే..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన వైర‌స్ ల‌క్షణాలు రోజుకొక్క రీతిలో మారుతున్నాయి. కొత్త ల‌క్షణాల‌తో క‌రోన వైర‌స్ హ‌డ‌లెత్తిస్తోంది. ఇప్పటి వ‌ర‌కు జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, పొడి ద‌గ్గు, జ‌లుబు, రుచి,వాస‌న తెలియ‌క‌పోవ‌డం వంటి ల‌క్షణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే.. తాజాగా మ‌రో కొత్త ల‌క్షణం.. కరోన వైర‌స్ సోకిన వారిలో బ‌య‌ట‌ప‌డింది. నాలుక ఎండిపోవ‌డం, నాలుక మీద దుర‌ద‌, నాలుకు మీద గాయాలు అనిపించ‌డం వంటి కొత్త ల‌క్షణాలు క‌రోన వైర‌స్ సోకిన వారిలో తాజాగా బ‌య‌ట‌ప‌డ్డాయి. దీనిని ఇప్పుడు ‘ కోవిడ్ టంగ్ ’ గా పిలుస్తున్నారు. ఈ ల‌క్షణాలు ఉన్నవారిలో అల‌స‌ట‌, విప‌రీత‌మైన నీర‌సం ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఇలాంటి ల‌క్షణాలున్న వారికి ప‌రీక్షలు నిర్వహించ‌గా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు డాక్టర్లు చెబుతున్నారు.

About Author