PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాహుల్ నైట్ క్ల‌బ్ వీడియో పై కాంగ్రెస్ రియాక్ష‌న్ ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాహుల్ గాంధీ నైట్ క్ల‌బ్ వీడియో వివాదం పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. వివాహ వేడుకకు రాహుల్ వెళ్లడం నేరమా? అని ఆ పార్టీనేత ర‌ణ‌దీప్ సూర్జేవాల ప్రశ్నించారు. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజుకు పిలవకుండా ప్రధాని మోదీ వెళ్లినట్టు.. రాహుల్‌ గాంధీ వెళ్ళలేదుగా అని అన్నారు. ఆహ్వానిస్తేనే రాహుల్ వివాహ వేడుకకు వెళ్లారని వివరించారు. ఫ్రెండ్ పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన ఖాట్మండ్ వెళ్లారని చెప్పారు. రాహుల్ వ్యక్తిగత టూర్‌లో ఉన్నారు. ఇందులో తప్పేముందో చెప్పాలని బీజేపీ నేతలకు సవాలు చేశారు.

                                    

About Author