హోళగుందలో రోడ్డు పరిస్థితి ఇది.!
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలో స్థానిక వాల్మీకి సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు, బస్టాండ్- సినిమా రోడ్డు పూర్తిగా దుమ్ము ధూళి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు ఎక్కువగా సాగుతాయి. దానివల్ల దుమ్మూ ధూళీ ఎక్కువగా ఉండటంతో వాహనదారులు అవస్థల పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.