NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇదేం ఖర్మ వినతుల నివేదిక తరలింపు           

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వైసిపి దుర్మార్గ పాలనలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం లో ప్రజలనుండి వచ్చిన వినతుల నివేదికలను జిల్లా టీడీపీ కేంద్రానికి పార్టీ శ్రేణులు శుక్రవారం తరలించారు.ఇదేమి కర్మ మన పత్తికొండకు కార్యక్రమం ముగింపు సందర్భంగా పత్తికొండ  నియోజకవర్గ ఇన్చార్జ్  కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గం లో నిర్వహించిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో  నమోదైన ప్రజా సమస్యల నివేదికలను జిల్లా పార్టీ కార్యాలయం నకు  సీనియర్ నాయకులు తిమ్మయ్య చౌదరి గారు  జెండా ఊపి వాహనాన్ని తరలించారు.ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ,జగన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు.వైఎస్సార్ పార్టీని ప్రజలు ఎవగించుకుంటున్నారాన్ తెలిపారు. జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం నేర్పే రోజులు దగ్గర పడ్డాయి చెప్పారు.వచ్చే ఎన్నికల్లో జగన్ కు చిత్తుగా ఓటమి ఖాయమన్నారు. టీడీపీ విజయ దుందిభి  మోగిస్త్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కే.సాంబ శివా రెడ్డి,మాజీ జడ్పీటిసి శ్రీనివాసులు, రామానాయుడు,అశోక్ కుమార్, తిరు పాల్,సింగం శ్రీనివాసులు,మీరా హుస్సేన్, ఉచ్చూరప్ప,తదితరులు పాల్గొన్నారు.

About Author