ఈ లాంతరు ఉప్పు నీటితో వెలుగుతుంది !
1 min readపల్లెవెలుగువెబ్ : దీపం వెలగాలంటే నూనె లేదా కరెంట్ కావాలి. కానీ ఈ లాంతరుదీపానికి మాత్రం ఉప్పునీరు ఉంటే చాలు. ఇది వెలుతురు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు, ఈ లాంతరుకు ఉన్న యూఎస్‌బీ పోర్టు ద్వారా దీపం వెలుగుతూ ఉండగా, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జింగ్ చేసుకోవచ్చు. లైట్‌పల్స్ ఎకో లాంతర్’ పేరిట ‘గ్యాలప్ ఇన్నోటెక్’ అనే చైనా కంపెనీ రూపొందించింది. ఇంతకీ ఉప్పునీటితో ఇదెలా వెలుగుతుందనేగా మీ అనుమానం. మామూలు లాంతరులో కిరోసిన్ నింపే బదులు, ఇందులో ఉప్పునీరు నింపుకోవాలి. దీని అడుగుభాగంలో అల్యూమినియం ప్లేట్ ఉంటుంది. దాంతో జరిపే రసాయనిక చర్య వల్ల పుట్టే విద్యుత్తే దీనికి ఇంధనం. ఈ లాంతరు వెలుతురును కోరుకున్న విధంగా అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటూ ఉంది.