PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ స్టాక్ ఇన్వెస్టర్ల పెట్టుబ‌డిని.. రెండేళ్లలో ప‌దింతలు చేసింది !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ రైల్వే కేట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ సంస్థ 2019 అక్టోబ‌ర్ 14న స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. లిస్టయిన స‌మ‌యంలో కంపెనీ ఇష్యూ చేసిన స్టాక్ రేటు 320 రూపాయలు. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ ధ‌ర 3,341 రూపాయ‌ల వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ప‌బ్లిక్ ఇష్యూ చేసిన స‌మ‌యంలో ఈ స్టాక్ కొనుగోలు చేసి ఉంటే… ఇప్పటికి కంపెనీ షేరు ధ‌ర ప‌దింత‌లు పెరిగింది. ఇన్వెస్టర్లు 320 వ‌ద్ద షేరును కొని ఉంటే.. ప్రస్తుతం వారి షేరు ధ‌ర 3,341 రూపాయ‌లుగా ఉంది. రాబోయే ఎనిమిది నెలల్లో షేరు ధ‌ర 5,000 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. త‌క్కువ కాలానికి ఈ కంపెనీలో పెట్టుబ‌డి పెట్టిన వారు లాభాన్ని స్వీక‌రించ‌వ‌చ్చ‌ని, దీర్ఘకాల పెట్టుబ‌డి పెట్టిన‌వారు అమ్మకుండా.. ఇలాగే కొన‌సాగించ‌వ‌చ్చని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. ఐఆర్సీటీసీ ఇండియ‌న్ రైల్వే లో ప్రయాణీకుల‌కు వాట‌ర్ బాటిల్ మొద‌లు కొని.. ఫుడ్, టికెట్ బుకింగ్ లాంటి స‌దుపాయాలు క‌ల్పిస్తుంది. ఈ స్టాక్ ధ‌ర ఇంత‌లా పెర‌గ‌డానికి ఈ స‌ర్వీసులు అందిస్తున్న ఏకైక సంస్థ ఐఆర్సీటీసీ కావ‌డం కార‌ణంగా చెప్పవ‌చ్చు.

About Author