PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెనుక సీట్లో ఉన్న‌వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మనదేశంలో కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లోని రూల్‌ నంబర్‌ 138(3)ప్రకారం ముందు సీట్లలో కూర్చున్నవాళ్లు, రోడ్డుకు అభిముఖంగా ఉండే (ఫ్రంట్‌ ఫేసింగ్‌) వెనుక సీట్లలో కూర్చున్నవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాల్సిందే. సీటు బెల్టు పెట్టుకోకపోతే వారికి రూ.1000 దాకా జరిమానా వేయొచ్చు. అంతేకాదు..కార్లలో ఫ్రంట్‌ ఫేసిం గ్‌ ప్యాసింజర్స్‌ అందరికీ ‘త్రీ పాయింట్‌ సీట్‌ బెల్ట్‌’ను తప్పనిసరి చేస్తూ గత ఫిబ్రవరిలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కార్లన్నింటిలో ముందు సీట్లకు, వెనుక రెండు సీట్లకు త్రీ పాయింట్‌ సీట్‌ బెల్ట్‌లున్నాయి. వెనుక మధ్య సీటుతోనే అసలు సమస్య. పాత కార్లకు మధ్య సీటుకు బెల్టే ఉండదు. ఇటీవలికాలంలో వస్తున్న కార్లలో వెనుక భాగంలోని మధ్య సీటుకు విమానాల్లోలాగా ‘టూ పాయింట్‌ సీట్‌బెల్టు’ మాత్రమే ఉంటోంది. దీంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మధ్య సీట్లో కూర్చున్నవారికి ప్రాణాపాయ ముప్పు, తీవ్ర గాయాలపాలయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటోంది. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలు మధ్య సీటుకు ‘త్రీ పాయింట్‌ సీట్‌బెల్ట్‌’ను అమర్చడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

                                

About Author