మైనర్ బాలుడి.. మరణానికి కారకులైన వారిని శిక్షించాలి
1 min read– ఉప్పాల అమర్నాథ్ గౌడ్ మరణానికి కార్కులైన వారిని కఠినంగా శిక్షించాలి..
– అమర్నాథ్ కుటుంబానికి ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందించాలి..
– బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి..
– రాష్ట్ర బీసీ సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : బాపట్ల జిల్లా రేపల్లెలో ఉప్పాల అమర్నాథ్ గౌడ్ మరణానికి కారకులైన వారిని చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని, ఏలూరు జిల్లా బీసీ సంఘాల తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. మైనర్ బాలుడిని మరణానికి కార్కులైన వారిని శిక్షించకుండా కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరించటం సిగ్గుచేటు అన్నారు, చనిపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా పరిషత్తు సెంటర్లో బైఠాయించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలు ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘాలు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం, ఆంధ్ర ప్రదేశ్ గౌడ సంఘం తరఫున బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ గా చలమోలు అశోక్ గౌడ్ మరియు బిసి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస చక్రవర్తి, కార్యదర్శి వెంకటేశ్వరరావు, యాదవ్ బీసీ అధ్యక్షులు తలకొండ జమాలయ, ఏలూరు జిల్లా బీసీ సంఘాల నాయకులు వీరవల్లి సత్యనారాయణ, సింహాద్రి శ్రీమన్నారాయణ గౌడ్, పంది సూర్యచంద్ర యాదవ్,( సర్పంచ్) విశ్వనాథం యాదవ్, శ్రీనివాస్ ఎంపీటీసీలు పలువురు టిడిపి బీసీ నాయకులు కార్యకర్తలు జోన్ 2 కోఆర్డినేటర్, రాష్ట్ర కన్వీనర్ చెల్లుబోయిన శ్రీనివాసరావు, మరియు బీసీ సంఘాల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.