NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసుల‌కు,రాడీషీట్లకు భ‌య‌ప‌డే వాళ్లు టీడీపీలో లేరు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: అక్రమంగా కేసులు, రౌడీషీట్లు పెడితే భ‌య‌ప‌డ‌బోమ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుటుంబ స‌భ్యుల పై రౌడీషీట్లు పెట్టడంపై చంద్రబాబు స్పందించారు. వైసీపీ నేత‌లు చెప్పిన‌ట్టు చేసే అధికారుల‌కు భ‌విష్యత్తులో ఇబ్బందులు త‌ప్పవంటూ హెచ్చరించారు. మ‌రో మూడు ఏళ్లే రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లులో ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత త‌ప్పు చేసిన వారు మూడింత‌లు మూల్యం చెల్లించుకోక త‌ప్పద‌ని చెప్పారు. పాల‌న గాలికొదిలేసిన ముఖ్యమంత్రి ప్రతిప‌క్ష నేత‌ల‌ను వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. హ‌రివ‌ర‌ప్రసాద్, సురేష్‌, కృష్ణమూర్తి పై పెట్టిన కేసులు ఎత్తి వేయాలి డిమాండ్ చేశారు.

About Author