మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి
1 min read– బాలల హక్కుల రాష్ట్ర సభ్యులు
– డాక్టర్ జంగం రాజేంద్ర ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : తల్లిదండ్రులులేని 18 ఏళ్ల లోపు పిల్లలకు ఆర్థిక అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రాయోజిత పథకం మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ ను సద్వినియోగం చేసుకోవా లని ఆంద్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యులు డాక్టర్ జంగం రాజేంద్ర ప్రసాద్ సూచిం చారు. స్కాలర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు రూ. 4వేలు అందించడంజరుగుతుందని తెలిపారు. ఈ పథకము కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని వివరించారు. ఒక కుటుంబం లో ఇద్దరు పిల్లల వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిరుపేద, నిస్సహాయ స్థితిలో 18 సంవత్సరాలు వయస్సు లోపు పిల్లలు అర్హులని తెలిపారు. వితంతువు, విడాకులు తీసుకున్న లేక కుటుంబం వదిలివేసిన తల్లిని కలిగిన పిల్లలు, అనాధ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న అనాధ బాలలు అర్హులన్నారు.ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రుల పిల్లలు, బాల న్యాయ (రక్షణ, ఆదరణ) చట్టం -2015 ప్రకారం. రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లలు- ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, హెచ్. ఐ. వి, ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగ వైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన, పారిపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు, వేదింపులకు, దుర్వినియోగం, దోపిడీలకు గురి అయిన బాలలు, సహాయం, ఆశ్రయం కావలసిన బాలలు పీఎం కేర్ ఫర్ చిల్డ్రెన్స్ మంజూరైన బాలలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న, విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి, గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చని, అయితే కమిటీ నిర్ణయమే అంతిమ నిర్ణయమన్నారు. పిల్లలకు తల్లి, తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు అర్హులన్నారు. తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు, బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (జె జె యాక్ట్,2015 ప్రకారం) కోవిడ్ 19 అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన అటువంటి పిల్లలకు అర్హులన్నారు. రెసిడెన్సియల్ స్కూల్ నందు చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదని ఆయన తెలిపారు. ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.72,000 కిఅదేవిధంగా పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.96,000 నుంచి ఉండరాదన్నారు.ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం 60 శాతం అంటే రూ. 2400 కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.1600 నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయను న్నారని తెలిపారు. ఈ పథకం నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొన సాగించేందుకు దోహదపడుతుందని వివరించారు.స్పాన్సర్ షిప్ కార్యక్రమం 18 సంవత్సరములు వయస్సు నిండే వరకు, మిషన వాత్సల్య పథకం ముగింపు వరకు బాలలు కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్ (సి.సి.ఐ)లో చేరినపుడు ఈ స్పాన్సర్ షిప్ ఆర్థిక సహాయం నిలుపుదల చేయబడుతుందని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.పిల్లలు 30 రోజులకు మించి స్కూలుకు హాజరు కానియెడల సదరు స్పాన్సర్ షిప్ నిలుపుదల చేయబడును. (ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపు కలదని వివరించారు.ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్స్ లో జాయిన్ అయితే అక్కడ నుంచి పథకం నిలుపుదల చేస్తారని, ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చని వివరించారు. తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదని, పిల్లల స్టడీ సర్టిఫికెట్స్ ఈ సంవత్సరం అనగా 2022- 2023 మాత్రమే సమర్పించాల న్నారు. బాలుడి, బాలిక జనన ధ్రువీకరణ పత్రం, బాలుడి, బాలిక ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డు తండ్రి ఆధార్ కార్డు, తల్లి, తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము,మరణ కారణము, గార్డియన్ ఆధార్ కార్డ, రేషన్ కార్డ్, రైస్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రము, బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో, స్టడీ సర్టిఫికేట్, ఆదాయ ధ్రువీకరణ పత్రము, బాలుడి, బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్. సమర్పించాలన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 10 లోగా స్థానిక అంగన్ వాడీ.కేంద్రం.టీచర్స్ ద్వారా సంబంధిత కార్యాలయాల్లో ధరఖాస్తు సమర్పించాలని డాక్టర్ రాజేంద్ర ప్రసాడ్ ప్రకటనలో తెలిపారు.